ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా బతకాలని చాలా మందికి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి వ్యాధులు లేకుండా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించడమెలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఇందుకు ప్రత్యేక ప్రణాళికలు ఏవీ పాటించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సింపుల్, ప్రాక్టికల్ టిప్స్‌ని పాటిస్తే జీవితంలో పెను మార్పులు వస్తాయని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ 5 రకాల అలవాట్లు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితాన్ని ప్రసాదిస్తాయని చెబుతున్నారు. జిమ్‌కి వెళ్లి బరువులు ఎత్తాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లతో జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. బ్రిస్క్ వాకింగ్, డ్యాన్సింగ్, యోగా వంటి మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీలతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల పాటు మోడరేట్ ఎక్సర్‌సైజ్ చేస్తే ఎనర్జీ, మూడ్ బూస్ట్ అవడంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది.
క్కొకరిది ఒక్కో శరీర తత్వం. మీ బాడీని బట్టి డైట్‌ని ప్లాన్ చేసుకోండి. పోషకాలతో నిండిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీన్ ప్రొటీన్, హెల్తీ ఫ్యాట్ ఫుడ్స్‌ని డైట్‌లో చేర్చుకోవాలి. ఆలివ్ ఆయిల్, నట్స్, తాజా ఆహారం ఆయుష్షును పెంచగలవు. అయితే అన్ని రకాల ఫుడ్స్ మీ శరీరానికి పడకపోవచ్చు. కాబట్టి మీ శరీరానికి తగిన పుష్టికరమైన ఆహారాన్ని ఎంచుకోవడం కీలకం. రెగ్యులర్‌గా హెల్తీ డైట్‌ని పాటిస్తే జీవనకాలం పెరుగుతుంది.జీవనశైలిలో మార్పుల కారణంగా చాలామంది బరువు పెరగడం, ఊబకాయం బారిన పడుతున్నారు. ఇవి గుండె వ్యాధులతో పాటు కీళ్ల నొప్పులు, డయాబెటిస్ వంటి సమస్యలకు దారితీసి జీవిత కాలాన్ని తగ్గిస్తున్నాయి. అందుకే హెల్తీ వెయిట్‌ని మెయింటేన్ చేస్తే జీవిత కాలం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువును పెంచే డైట్లకు బదులు వెయిట్ లాస్‌కు తోడ్పడే డైట్‌ని ఫాలో అవ్వాలి. డైట్‌ని బ్యాలెన్స్ చేస్తూనే క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేస్తే బాడీ యాక్టివ్‌గా ఉండటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును నివారిస్తుంది.