గుంటూరు నగర పాలక సంస్థలో మేయర్ కావటి మనోహర్ సుప్రీం అవుతారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలిపారు. కౌన్సిల్‌లో కమిషనర్ అహంకారంతో వ్యవహరించారని ఆయన తప్పుపట్టారు. కమిషనర్ తీరును వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా పరిగణించిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కమిషనర్ చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. కమిషనర్ తీరును తప్పుపడుతూ ప్రజాపోరాటం చేస్తామని మాజీ మంత్రి హెచ్చరించారు.