జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. జై జగన్ అంటే కేసులు పెడుతున్నారని జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరావు పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ ఫ్లెక్సీలను చించి తిరిగి మా పార్టీ కార్యకర్తలపైనే కేసు నమోదు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మణితేజది ముమ్మాటికీ హత్యే. మణితేజ మృతిని హత్య కేసుగానే నమోదు చేయాలి. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులను బెదిరిస్తూ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.