పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది ఇళ్లలో ఉదయం మాత్రమే కాదు, రాత్రి పడుకునే ముందు కూడా ఒక గ్లాసు పాలు తాగడం అలవాటు ఉంటుంది. అయితే, ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల కలిగే లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచికి బదులు హాని చేస్తుంది. ఎందుకంటే పాలలో ఉండే లాక్టోస్ (చక్కెర) శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. కొంతమందికి పాల సంబంధిత ఉత్పత్తుల వల్ల అలెర్జీలు వస్తాయి. అలాంటి వారు ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే డయేరియా, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. కొంతమందికి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. అలాంటివారు ఖాళీ కడుపుతో పాలు తాగితే చర్మం దురద, డయేరియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగితే అందులో ఉండే కాల్షియం, ఇనుము వంటి పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుంది. దీంతో శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది. పాలు అన్ని రకాల శరీరాలకు అనుకూలం కాకపోవచ్చు. లాక్టోజ్ అసహనత ఉన్న వ్యక్తులు పరగడుపున పాలు తాగితే ఉబ్బరం, మలబద్ధకం, లేదా డయేరియా వంటి జీర్ణ సమస్యలు ఎదుర్కొనవాల్సి వస్తుంది. కొందరికి శరీరంలో ఇప్పటికే ఎక్కువ ఆమ్లత్వం ఉంటే, పాలు తాగడం మరింత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఇది గ్యాస్ లేదా ముక్కుసొక్కడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
పరగడుపున పచ్చి పాలు తాగడం కంటే, పాలను కొంచెం వేడి చేసి తాగడం మంచి ప్రయోజనాలను అందిస్తుంది. ఇది శరీరానికి సులభంగా జీర్ణం అవుతుంది. పాలతో పాటు తేనె, అల్లం లేదా ఇతర సహజ పదార్థాలను కలిపి తాగడం శరీరానికి మరింత మేలు చేస్తుంది. పరగడుపున పచ్చి పాలు తాగడం శరీరానికి ప్రయోజనకరమా, ప్రతికూలమా అనేది వారి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. జీర్ణశక్తి బలంగా ఉంటే, పరిమిత మోతాదులో పచ్చి పాలు తీసుకోవడం ఆరోగ్యకరమే. అయితే, సమస్యలుంటే, ముందు డాక్టర్ సూచన తీసుకోవడం ఉత్తమం. మీరు ఏదైనా వ్యాధికి మందులు వాడుతుంటే ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగకండి. ఎందుకంటే పాలలో కాల్షియం ఉండటం వల్ల అది మీరు తీసుకునే మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.