ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. శనివారం శ్రీకాకుళంలోని జిల్లా కోర్టు సమావేశ మంది రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయంలో హెల్మెట్ ప్రాణాలు కాపడుతుందని తెలిపారు. పైడి భీమవరం ఆంరధా ఆర్గానిక్ లిమిటెడ్, సూర్యమహాల్, అరసవల్లిలోని మహిళా కళాశాల పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ హెల్మెట్లను సమకూర్చగా, కోర్టులో విధులు నిర్వ హిస్తున్న పలువురు ఉద్యోగులకు వాటిని అందజేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, న్యాయాధికారులు పి.భాస్కరరావు, సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ఎస్‌ఎం ఫణికుమార్, కె.కిషోర్‌బాబు, కె.శారదాంబ, కేవీఎల్ హిమబిందు, సీహెచ్ యుగంధర్, జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.