ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు పర్యటన ముగించుకొని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో అమిత్ షాకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇక ఆదివారం ఉదయం రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఆ తర్వాత కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్‌తోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.