కూరలు వండేటప్పుడు అన్నీ పదార్థాలు సరిగా వేస్తేనే రుచిగా ఉంటాయి. వాటిని చక్కగా తినగలం. కానీ, కొన్నిసార్లు తెలియకుండానే కారం ఎక్కువవుతుంది. దీంతో వాటిని తినలేం. కానీ, అలా జరిగినప్పుడు కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే అందులోని కారాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. ఎక్కువగా గ్రేవీల్లోనే పులుపు ఎక్కువవుతుంటుంది. కొత్తగా వండేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్ హ్యాక్స్ కూడా కూరల్ని సరిచేస్తాయి. ఇక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యే మరో విషయం ఏంటంటే ఈ టిప్స్‌తో కూరలు మరింత టేస్టీగా మారతాయి. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.
కొబ్బరి పేస్ట్, పాలు
అదే విధంగా, కొబ్బరిని మెత్తగా పేస్ట్‌లా చేసి ఆ పేస్ట్‌ని కూడా కూరల్లో కలపొచ్చు. దీంతో కూర గ్రేవీలు చక్కగా ఉంటాయి. లేదంటే కొబ్బరి పాలు వేసినా కూడా చక్కగా గ్రేవీలా ఉంటుంది. కూర టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసిన కూరలు అన్నం, చపాతీలు.. దేంట్లోకైనా బాగుంటాయి.
కూరగాయలు
అదే విధంగా, కూరల్లో కారం ఎక్కువైనప్పుడు మరిన్ని కూరగాయలు కలపండి. క్యాప్సికమ్, క్యారెట్స్, బఠానీలు వీటిని కలపొచ్చు. దీంతో రుచి పెరుగుతుంది. కారం తగ్గుతుంది. అయితే, వాటిని వేశాక చక్కగా ఉడకనివ్వండి. అప్పుడే కూరలు రుచిగా ఉంటాయని గుర్తుంచుకోండి.
స్టార్చ్ ఐటెమ్స్
అదే విధంగా, స్టార్చ్ ఎక్కువగా ఉండే ఉడకబెట్టిన బంగాళాదుంపలు, అన్నం, బ్రెడ్ వంటివి వేయడం వల్ల ఎక్సెస్ స్పైసీనెస్ తగ్గుతుంది. దీంతో కారం ఎక్కువగా ఉండదు. కూరలు కూడా టేస్టీగా ఉంటాయి.
టమటా ప్యూరీ
టమాటల్ని ప్యూరీలా చేసి ఆ ప్యూరీని కూరలో కలిపి ఉడికించండి. దీంతో కూరలకి మంచి టేస్ట్ వస్తుంది. అయితే, పచ్చిగా ప్యూరీ వేయడం ఇష్టం లేని వారు.. టమాటల్ని నూనెలో వేయించి మెత్తగా ప్యూరీలా చేసి కూరలో వేసినా కూర టేస్ట్ బాగుంటుంది.
నిమ్మరసం
పంచదార కలపడం ఇష్టం లేని వారు నిమ్మరసం కూడా కలపొచ్చు. దీని వల్ల కూరకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. కూరలు చక్కగా ఉంటాయి. అయితే, నిమ్మరసం మరీ ఎక్కువ మోతాదులో పిండకూడదు. కాస్తా పరిమానంలోనే వేయాలి. ఓ సారి రుచి చూసి కారం తగ్గకపోతే మరికాస్తా యాడ్ చేయాలి. దీంతో కూర టేస్ట్ చాలా బాగుంటుంది.
డెయిరీ
కూరల్లో కారం ఎక్కువైనప్పుడు పాల పదార్థాలు పెరుగు, క్రీమ్ వంటివి వేయొచ్చు. దీంతో మసాలా పదార్థాల్లోని స్పైస్‌నెస్ తగ్గుతుంది. కూరలు కూడా చక్కగా టేస్టీగా ఉంటాయి. గ్రేవీ కూడా చిక్కగా స్టార్ హోటల్ కూరల్లా వస్తాయి.
కారం ఎక్కువైతే
కూరలు స్పైసీగా ఉంటేనే తినేవాళ్లు కొంతమంది ఉంటారు. అలా అని మరీ ఎక్కువగా స్పైసీగా ఉన్నా వాటిని ఇష్టంగా తినలేరు. అలాంటప్పుడు కూరలో కారం ఎక్కువైతే చెంచా చక్కెర కలపాలి. దీంతో ఎంత కారంగా ఉన్నా కూరైనా సరే కారం తగ్గి రుచిగా మారుతుంది.