పరగడుపున కలబంద తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కలబందను ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. చర్మం, జుట్టు, మెటిమలు, కాలిన గాయాలకు కలబంద మంచి ఔషధంగా పనిచేస్తుంది. అలాగే పిరియడ్స్‌లో వచ్చే నొప్పిని నియంత్రించవచ్చు. ఉదయం కలబంద జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.