తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గత జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనేక కారణాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్ళిందని, వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆయన మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి 25 శాతం ఉత్పత్తి సామర్థ్యం ఉందని, ఇప్పుడు రూ.1650 కోట్లతో 75 శాతానికి ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్లాంట్ అభివృద్ధికి కృషి చేసిన కూటమి నేతలకు ధన్యవాదాలు చెప్పారు. ప్లాంట్ అభివృద్ధికి కార్మికులు, యాజమాన్యం సమష్టి కృషి చేయాలని పల్లా శ్రీనివాస్ పిలుపిచ్చారు.