పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని సీపీఎం నాయకులు రణధీర్, సుధాకర్, స్వాములు డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు జిల్లా, ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గో బ్యాక్ అమిత్‌షా అంటూ నిరసన వ్యక్తం చేశశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో రాజ్యాంగానికి సంబంధించిన చర్చ జరిగే సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీ స్పందించకపోవడం సరికాదన్నారు. తక్షణమే కేంద్ర మంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేసి ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సంపత్‌కుమార్, సురేంద్ర, రామ్‌నాయక్, శివకుమార్, కిరణ్, మల్లయ్య, గణపతి, రమణ, రవి తదితరులు ఉన్నారు.