మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేద్దామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. కళ్యాణదుర్గంలో మున్సిపాలిటీ కమీషనర్, ఛైర్మన్ల సమక్షంలో సోమవారం బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ. 12. 05 కోట్ల బడ్జెట్ కేటాయింపుకు వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు సహకరించి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధి కృషి చేయాలన్నారు.