పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం ఉందని మంత్రి నారా లోకేష్ స్విస్ పారిశ్రామికవేత్తలకు తెలిపారు. జ్యూరిచ్‌లో వారితో భేటీ అయిన లోకేష్, రాష్ట్రంలో పెట్టబడులు పెట్టాలని కోరారు.
తాము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ, విశాలమైన రోడ్లు, తీర ప్రాంతం, నౌకాశ్రయాలు ఉన్నాయని చెప్పారు. త్వరలో మరిన్ని పోర్టులు అందుబాటులోకి వస్తాయన్నారు.