రోడ్ భద్రత మాసోత్సవల సందర్బంగా పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల న్నారు.
దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందని, తొందరపాటుతనంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. అతి వేగంతో, అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో నడిపే వారితోపాటు ఎదుటి వారు కూడా ప్రమాదా లకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పొందే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆ విద్యార్థి పెరిగి పెద్దయిన తరువాత ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే భవిష్యత్లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జాహెద్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.