భారత్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్, హ్యూమన్ రిసోర్చ్ డైరెక్టర్ ఎన్. విక్రమన్ తో మంగళవారం బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కే. పార్థసారధి భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా హిందూపురం పార్లమెంట్ పరిధిలో సీఎస్ ఆర్ నిధులతో చేయవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అయన కూడా సానుకూలంగా స్పందించి వచ్చే ఏప్రిల్ నెల నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.