ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను కోరారు. కాగా ఈ సదస్సుకు తొలిసారిగా భారత్ భారీ బృందాన్ని పంపింది. భారత్ బృందంలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది మంత్రులతోపాటు దాదాపు వంద మంది సీఈవోలు, ఇతర అధికారులు ఉన్నారు.