అనంతపురం జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్లో మంగళవారం డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా పలు పంటలకు మంజూరు చేసే రుణ పరిమితిని ఖరీఫ్-2025, రబీ 2025-26 సంవత్సరాలకు నిర్ణయించామన్నారు. ఈ పరిమితిని రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదం కోసం పంపినట్లు వివరించారు.