అన్నదమ్ముల కుటుంబ సభ్యులు ఘర్షణకు పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురిపై మంగళవారం యాడికి పోలీసులు కేసు నమెదు చేశారు. కోనఉప్పలపాడులో సంజీవరాయుడుకు, అతని అన్న కొడుకుల మధ్య పొలం విషయంపై తగాదా ఉంది. దీనిపై సోమవారం వాదనలు చేసుకున్నారు.
ఈ క్రమంలో సంజీవరాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరయ్య, బాలు, పుల్లయ్య, సంజీవరాయుడు కలిసి దాడి చేశారు. ఈఘటనలో గాయపడిన సంజీవరాయుడు మంగళవారం ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.