గార్లదిన్నె రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం గూడ్స్ రైలు ఢీకొని నారాయణ మృతిచెందాడు. గార్లదిన్నెకు చెందిన ఇతను రైల్వేట్రాక్ సమీపంలో తోటకు వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా గూడ్స్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
ఆయన గతంలో గార్లదిన్నె పంచాయతీ సర్పంచిగా పదవి చేపట్టారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు సందర్శించి పరిశీలించి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.