దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. 2018లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఏబీ.. 2021లో ఐపీఎల్ చివరి మ్యాచ్ ఆడాడు. తాజాగా ‘రన్నింగ్ బిట్‌వీన్ ది వికెట్స్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ మరోసారి క్రికెట్ ఆడే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సాధారణ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఐపీఎల్, ఇతర లీగ్‌ల్లో పాల్గొనే ఆలోచన లేదని పేర్కొన్నాడు.