భారతదేశంలో పసిడి ప్రియులు రోజురోజుకూ పెరిగిపోతున్న రేట్లతో గందరగోళానికి గురవుతున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో గోల్డ్ సామాన్యులకు అందుబాటు ధరల్లోకి వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు.ట్రంప్ ఎంట్రీ తర్వాత తగ్గుతుందనుకున్న గోల్డ్ ఇప్పటికీ భారీ ర్యాలీని కొనసాగిస్తోంది. వాణిజ్య యుద్ధం భయాలు కూడా దీనికి కారణంగా ఉన్నాయి.ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాము ధర చెన్నైలో రూ.7525, ముంబైలో రూ.7525, దిల్లీలో రూ.7540, కలకత్తాలో రూ.7525, బెంగళూరులో రూ.7525, కేరళలో రూ.7525, వడోదరలో రూ.7530, అహ్మదాబాదులో రూ.7530, జైపూరులో రూ.7464, కోయంబత్తూరులో రూ.7449, నాశిక్ లో రూ.7528, అయోధ్యలో రూ.7540, బళ్లారిలో రూ.7525, గురుగ్రాములో రూ.7540, నోయిడాలో రూ.7540 వద్ద కొనసాగుతున్నాయి.ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రేటు రూ.8,600 పెరిగింది. దీంతో నేడు దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ ధరలను గమనిస్తే.. గ్రాము ధర చెన్నైలో రూ.8209, ముంబైలో రూ.8209, దిల్లీలో రూ.8224, కలకత్తాలో రూ.8209, బెంగళూరులో రూ.8209, కేరళలో రూ.8209, వడోదరలో రూ.8214, అహ్మదాబాదులో రూ.8214, జైపూరులో రూ.8137, కోయంబత్తూరులో రూ.8122, నాశిక్ లో రూ.8212, అయోధ్యలో రూ.8224, బళ్లారిలో రూ.8209, గురుగ్రాములో రూ.8224, నోయిడాలో రూ.8224 వద్ద విక్రయాలు నేడు జరుగుతున్నాయి.తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7525గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8209 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో తెలంగాణలో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే కేజీకి రేటు రూ.1,04,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వాస్తవానికి పైన పేర్కొన్న రేట్లకు జీఎస్టీ, తయారీ మజూరి, తరుగు వంటి అదనపు ఖర్చులు ఉంటాయని వినియోగదారులు గుర్తించాల్సి ఉంటుంది.