కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో మరో కీచక ఉపాధ్యాయుడికి బుధవారం దేహశుద్ధి చేశారు. పాఠశాల విద్యార్థినులపై లక్ష్మన్న అనే టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థినులను లైంగికంగా వేధించడంతో వారు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. గ్రామ ప్రజలందరూ కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పాఠశాల గదిలో బంధించారు. పోలీసులు పాఠశాలకు చేరుకుని తమదైన శైలిలో టీచర్‌ను విచారిస్తున్నారు.