రణస్థలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఒక యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్టు జేఆర్ పురం ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆ బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యు లు ఆరా తీయగా ఆసలు విషయం బయటపడింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఎన్.ప్రసాద్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం ఆ బాలికను లోబరుచుకుని గ్రామ సమీపంలోని ప్రభుత్వ భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు చెపితే చంపేస్తానని బెదిరించాడు. ఆ బాలిక వ్యవహార శైలిలో మార్పులు రావడంతో గమనించిన కుటుంబ సభ్యు లు ఏం జరిగిందని గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని బయట పెట్టింది. వెంటనే కుటుంబ సభ్యులు జేఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.