వజ్రపుకొత్తూరు పరిధిలోని చినబైపల్లి జీడి తోటలో మహిళ తామాడ శాంత మ్మ (55) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బి.నిహార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నా యి. శాంతమ్మ జీడితోటలో ఓ చెట్టుకు నైలాన్ తాడుతో ఉరి వేసుకుంది. అయితే తాడు తెగిపోయి మృతదేహం కింద పడి ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. శాంతమ్మ భర్త తులసీదాస్ చాలా ఏళ్ల కిందట మృతి చెందారు. కుమారుడు హరికృష్ణ ప్రస్తుతం సీమెన్‌గా, కోడలు వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో శాంతమ్మ ఒంటిరిగానే బైపల్లి గ్రామంలో ఉంటోంది. ఏఎస్‌ఐ జూన్నా రావు ఘటనా స్థలానికి చేరు కొని పరిశీలించారు. శవపంచనామా నిర్వ హించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.