కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 ప్రాజెక్ట్‌లను పునఃపరిశీలిస్తున్నారు. వైసీపీ హయాంలో దాఖలు చేసిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలపై కూటమి ప్రభుత్వం ఆరా తీస్తోంది. పనులను ఆమోదించడంలో జాప్యం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు టెండర్‌ల దశకు తీసుకొచ్చింది. అయితే వాటి అవసరాలు ఎంత మేర ఉన్నాయనే విషయమై తెలుగు దేశం కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోంది. జిల్లా అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. ఆ తర్వాత తుది ఆమోదం తెలపనుంది. ఒక్క తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ మాత్రమే ముందుకు వెళుతోంది. పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన పట్టణాల్లో అమృత్ 2.0 ప్రాజెక్ట్‌లు మాత్రం ప్రభుత్వం తుది ఆమోదం తర్వాతే టెండర్ దశకు చేరుకోనున్నాయి. ఆ తర్వాతే టెండర్లు ఖరారు చేస్తారు. తదుపరి పనులు ప్రారంభిస్తారు. వాస్తవానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అమృత్ 2.0 అమలు లోకి వచ్చింది. అప్పట్లో పనులు గుర్తించా రు. వైసీపీ హయాంలో తీవ్ర జాప్యం చేశారు. జిల్లా నుంచి సమగ్ర నివేదిక ప్రాజెక్టులు పంపి నా అనుమతులు ఇవ్వలేదు. ఎన్నికల ముందే హడావిడిగా ఆమోదం తెలిపింది. అప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అయినా సరే టెండర్లపై కాంట్రాక్టర్లు స్పందించని పరిస్థితి. కూటమి అధికా రంలోకి వచ్చిన తర్వాతే పనుల్లో కదలిక వచ్చింది. అమృత్ 2.0పైనా దృష్టి పెట్టింది. గతంలో ఇచ్చిన ప్రాజెక్ట్ నివేదికలపై మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ప్రస్తుత అవసరాల కు అనుగుణంగా తీర్చిదిద్దుతు న్నారు.