ప్రాపర్టీ కేసుల నియంత్రణలో ప్రత్యేక చొరవచూపాలని పోలీస్ అధికారులను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. విజిబుల్ పోలీసింగ్, రాత్రి గస్తీని మరింత బలోపేతం చేసి ఎన్ ఫోర్స్‌మెంట్ వర్క్ పెంచాలని సూచించారు. చోరీలను అరికట్టాలన్నారు. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా ప్రతి ఒక్క రూ విధులు నిర్వర్తించాలన్నారు.ప్రజలతో చాలా మర్యాదగా వ్యవహరించాలన్నారు. మిస్సింగ్, పోక్సో, ఎస్టీ ఎస్టీ కేసులపై ఆరా తీశా రు. ఎప్పటికప్పుడు నేరస్తుల వివరాలు కచ్చితంగా అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. బహిరంగ మద్యపానం, డ్రంకెన్ డ్రైవ్‌పై ముమ్మరం గా తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.సారా,గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేయాలన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు సంబంఽధించి ఆయా ప్రాంతాలలోని ప్రజల నుంచి సమాచారం తీసుకుని దాడులు నిర్వ హించాలని ఆదేశించారు. రోడ్డుప్రమాదాలు నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నా రు.సమీక్షలో అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు, ఏఎస్పీ క్రైమ్స్ ఎల్.అర్జున్, ఏఆర్ ఏఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ, సీఐలు ఏ.శ్రీనివాసరావు, పవన్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.