బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో పాటు 11 మంది వీరుల విగ్రహాలతో అత్యద్భు తంగా రాజమహేంద్రవరం కంబాలచెరువు వద్ద ఉన్న చిరంజీవి పార్కును అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పార్కు పనులను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజుకు రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధానికి గుర్తుగా ఈ పార్కులో రూ.50 లక్షలతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్కు సుందరీకరణకు రూ.70 లక్ష లు కేటాయించామన్నారు. ఈ పార్కును గతంలో మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రా రంభిచారని గుర్తుచేశారు. ఈ పార్కు ప్రాధాన్యతను పెంచే పనులు ఫిబ్రవరి నెల రెండో వారంలో పూర్తవుతాయన్నారు. అప్పుడు పార్కు ప్రారంభోత్సవానికి మెగా ఫ్యామిలీ కుటుంబీకులను ఆహ్వాని స్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నగర ఇన్‌చార్జి అనుశ్రీ సత్యనారాయణ, వై.శ్రీను, జామి సత్యనారాయణ పాల్గొన్నారు.