రాజమహేంద్రవరం సెంట్రల్ విజిటబుల్ మార్కెట్ వద్ద తాగునీటి పైపులైన్‌కు తక్షణమే మరమ్మతులు చేసి తాగునీరందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆదేశించారు. సెంట్రల్ విజిటబుల్ మార్కెట్‌ను మంగళవారం సాయంత్రం పరిశీలించారు. హెడ్ వాటర్‌ట్యాంక్ పగిలి తాగునీరు వృథాగా వ్యాపార సముదాయాల్లోకి వస్తుందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సం బంధిత అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. మార్కెట్ సమీపం లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలతో ఇబ్బందిపడుతున్నామని స్థానికులు చెప్పగా ఆయన వెంటనే పోలీసులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, మజ్జి రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.