నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. రవి అనే వ్యక్తి తన పదకొండేళ్ల కొడుకుని అమ్మేశాడు. గతంలో పెద్ద కొడుకుని కూడా అమ్మేశాడని స్థానికులు చెబుతున్నారు. డబ్బుల కోసం తమ బిడ్డలను కూడా అమ్మేస్తాడేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రవిపై కఠినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.