ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యను చంపి, ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడికించి.. రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఘాతుకం

Crime |  Suryaa Desk  | Published : Wed, Jan 22, 2025, 11:02 PM

అతడు ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్. సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన డీఆర్‌డీఓలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే హైదరాబాద్‌లోని మీర్‌పేట పరిధిలో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యపై అనుమానం పెంచుకున్న ఆ రిటైర్డ్ ఆర్మీ జవాన్.. ఒకరోజు ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత ఆ ముక్కలను ప్రెజర్ కుక్కర్‌లో ఉడికించాడు. ఆ ఉడికించిన ముక్కలను తీసుకెళ్లి.. ఎవరి కంటా పడకుండా చెరువులో పడేశాడు. ఆమె కనిపించడం లేదని.. భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చివరికి విచారణ చేపట్టిన పోలీసులు.. భర్తే ఈ పని చేశాడని గుర్తించారు.


కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయి మారాడు. భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్‌లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు.


హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి రావడం తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి అనే మాజీ సైనికుడు.. ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత డీఆర్డీఓలో ఔట్ సోర్సింగ్‌ విభాగంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంటక మాధవి(35), ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈనెల 13వ తేదీ నుంచి మాధవి కనిపించడం లేదని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు.. ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.


అయితే తన భార్యను చంపిన విషయాన్ని దాచిపెట్టిన గురుమూర్తి.. ఏమీ తెలియనట్లుగా అత్తామామలతో కలిసి మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంపై విచారణ జరిపినన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. గురుమూర్తే తన భార్య మాధవిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు వెల్లడైంది. అయితే భార్యను చంపడానికి ముందు గురుమూర్తి ఒక కుక్కను చంపినట్లు పోలీసులు గుర్తించారు.


అయితే తన భార్యపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి.. ఒకరోజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను అతి దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత డెడ్‌బాడీని ముక్కలు ముక్కలుగా నరికి వేరు చేశాడు. ఆ తర్వాత ఆ ముక్కలను కుక్కర్‌లో ఉడకబెట్టి.. ఆ ముక్కలను జిల్లెల్లగూడలో ఉన్న చందన చెరువులో పడేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు ప్రవర్తించాడు. చివరికి మాధవి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com