ఒక వైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరిస్తూ..మరోవైపు పెట్టుబడులు పెట్టమని ప్రాధేయపడితే, వారెలా ముందుకొస్తారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్ సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా? అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందని స్పష్టం చేశారు. రాష్ట్రం విడిచివెళ్లిన సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పి, ఆ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.