పాలకొల్లు పట్టణంలో దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన కలిశెట్టి అనసూయమ్మ కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఇటీవల పాలకొల్లు పట్టణంలోని 20వ వార్డు చెందిన కలిశెట్టి అనసూయమ్మను డబ్బుల కోసం దుండగులు హత్య చేసిన విషయాన్ని వైయస్ఆర్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్పందించిన వైయస్ జగన్ తన సొంత నిధులు రూ.10 లక్షలు బాధిత కుటుంబానికి నాయకుల ద్వారా అందించారు. ఈ మేరకు బుధవారం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) చేతుల మీదుగా అనసూయమ్మ కుమారుడు కలిశెట్టి విశ్వనాథ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.