ప్రముఖ టెక్ సంస్థ యాపిల్‌కు చుక్కెదురైంది. ఐఫోన్‌లలో ఐఓఎస్ 18+ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లోని లోపాలకు సంబంధించిన ఫిర్యాదులపై కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇటీవల తమ ఐఫోన్‌లలో ఐవోఎస్ 18+ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన తర్వాత సమస్యలు వస్తున్నట్లు యూజర్లు ఫిర్యాదు చేయడంతో కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ద్వారా యాపిల్‌కు నోటీసులు పంపించామని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.