ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్టణంలో ఉన్న జువైనల్ హోమ్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం రోడ్లపైకి వచ్చి తమకు మత్తుమందు ఇచ్చి మతిస్థిమితం లేని రోగులుగా చిత్రీకరిస్తున్నారని యువతులు ఆరోపించారు.తాజాగా ఈ రోజు ఉదయం కూడా.. జువైనల్ హోమ్ గోడ మీద కెక్కిన బాలికలు బిగ్గరగా అరుస్తు హల్చల్ చేశారు. అనంతరం గోడ మీదకు ఎక్కిన వారు..పెంకులు విసిరేసి బూతులు మాట్లాడుతూ బాలికలు హంగామా చేశారు. అనంతరం మమ్మల్ని ఇంటికి పంపించలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.అలాగే స్లీపింగ్ ట్యాబ్లెట్స్(Sleeping tablets) ఇచ్చి రోగులుగా మారుస్తున్నారని మరోసారి ఆరోపణలు చేశారు. అయితే ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి అనిత(Home Minister Anita) స్పందించి పోలీస్ కమీషనర్, విశాఖ కలెక్టర్‌తో మాట్లాడి విచారణకు ఆదేశించారు. అయితే సదరు బాలికలు కొద్దిరోజులుగా అలాగే ప్రవర్తిస్తున్నారని జువైనల్ హోమ్ సిబ్బంది తెలుపుతుండగా.. పోలీసుల విచారణలో ఎవరు చెప్పేది అసలు నిజమే తేలనుంది. ఒక వేళ బాలికల ఆరోపణలు నిజమైతే.. సదరు వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని హోమ్ మంత్రి అనిత చెప్పుకొచ్చారు.