అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్.
ఆ దిశగా కీలక ముందడుగు వేశారు. ఈ విషయంలో చట్టసభలో ఆయనకు తొలి విజయం లభించింది. అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో అధ్యక్షుడిగా ట్రంప్ సంతకం చేసే తొలి బిల్లు ఇదే కానుంది.