కూర విషయంలో మావ, అల్లుడి మధ్య తలెత్తిన గొడవలో తలదూర్చి, ప్రాణాలు పొగొట్టుకున్నా డో వ్యక్తి.. దీనికి సంబంధించి పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామ రాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన ఎటపాక మం డలం చోడవరం పంచాయతీలోని ఎర్రకుంట కాలనీకి చెందిన తుమ్మల సునీల్, పొడియం చిన చెంచయ్య మావ అల్లుడు. మంగళవారం రాత్రి వీరిద్దరి మధ్య కూర విషయంలో వివా దం జరిగింది. దీంతో ఆ సమయంలో అల్లుడు సునీల్ కోపంతో అతడి మావ చెంచయ్యపై కర్రతో దాడిచేశాడు. ఈ సమయంలో చెంచయ్యకు సన్నిహితుడైన రాజు అనే వ్యక్తి ఎందుకు కొడుతున్నావంటూ సునీల్‌ను కొట్టే ప్రయ త్నం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన సునీల్ తన చేతిలోని కర్రతో రాజును తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఘటన అనంతరం నిందితుడు సు నీల్ అక్కడినుంచి పరారయ్యాడు. కాగా మృతు డు రాజు 20ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి ఈ గ్రామానికి వచ్చి ఇంటింటా పనులు చేసు కుంటూ జీవిస్తున్నాడు. ఎటపాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.