దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఈ అర్ధరాత్రి 12.15 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి చంద్రబాబు నేరుగా 1 జన్ పథ్ లోని తన అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. రేపు (జనవరి 24) చంద్రబాబు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులను కలవనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. అనంతరం, రేపు సాయంత్రం చంద్రబాబు విజయవాడ బయల్దేరి రానున్నారు.