ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తో త్వరలో భేటీ అవుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. గతంలో కూడా వీరిద్దరూ సమావేశమైన విషయం తెలిసిందే.ఇరు దేశాల చర్చలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పందిస్తూ.. 'తప్పకుండా.. అతడికి నేనంటే ఇష్టం' అని అన్నారు. కిమ్ చాలా స్మార్ట్ అని కొనియాడారు. దక్షిణ కొరియా, అమెరికా నుంచి ముప్పు పొంచి ఉందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.