సాధారణంగా మొబైల్ ఫోన్ రిఛార్జ్ చేసుకుంటే వాయిస్ కాల్స్, SMS, డేటా అన్ని ఒకే ప్లాన్‌లో వస్తాయి. అయితే, కొంతమంది అసలు మొబైల్ డేటాను అసలు వినియోగించరు. కానీ, మనం చేసుకునే రిఛార్జ్‌లో దానికోసం కూడా డబ్బులు చెల్లిస్తున్నాం. అలాంటి వారి కోసం Jio, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం సంస్థలు స్పెషల్ ప్లాన్‌ను అందిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల మేరకు కేవలం వాయిస్ కాల్స్, SMS సేవలకు ఉపయుక్తంగా ఉండే ప్రీపెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించాయి.
ఎయిర్‌టెల్: కేవలం రూ.499 రిఛార్జ్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 SMSలతో 84 రోజుల వ్యాలిడిటీతో ఒక ప్లాన్. ఇక రెండవది రూ.1,959 ధరతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3,600 SMSలతో 365 రోజుల వ్యాలిడిటీ.
Jio: రూ.458 ధరతో రిఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1000 SMSలతో 84 రోజుల వ్యాలిడిటీ. మరో ప్లాన్ రూ.1,958తో రిఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్‌కాల్స్, 3600 SMSలతో 365 రోజుల వ్యాలిడిటీ.
వొడాఫోన్ ఐడియా: కేవలం రూ.1460తో రిఛార్జ్ చేసుకుంటే 270 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 SMSలను పొందవచ్చు.