ఏపీలో ఐదేళ్లలో విద్వేష పాలన కొనసాగిందని పల్లా శ్రీనివాస్‌రావు విమర్శించారు. ఏ ఒక్కరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదని అన్నారు. యవగళం పాదయాత్ర సమయంల్లో స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. లోకేష్ హామీ మేరకు కూటమి నేతలంతా కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్యాకేజీ తీసుకువచ్చారని చెప్పారు. వైసీపీ హయాంలో కొన ఊపిరితో స్టీల్ ప్లాంట్ కొట్టుమిట్టాడిందని చెప్పారు. కొన ఊపిరితో ఉన్న స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగ పడుతుందని పల్లా శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు.టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్‌గా లోకేష్ ఉన్నారని చెప్పారు. 15 సెకండ్లలో ఒక మెంబర్ షిప్ చేయగలుగుతున్నామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం పదవికి టీడీపీలో ఒక నియమావళి ఉందన్నారు. కొంత మంది నియమావళి దాటి మాట్లాడుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు కూటమిలో ఉన్న మూడు పార్టీలను విడదీయాలని కాలకేయులులాగా చూస్తున్నారని ఆక్షేపించారు. కూటమి నేతలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పల్లా శ్రీనివాస్‌రావు సూచించారు.