ప్రభుత్వం పశుపోషకులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి శుభాష్ అన్నారు. శుక్రవారం కె.గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పర్యటించిన మంత్రి పశు ఆరోగ్య వైద్య శిబిరాలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పశు పోషకులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జనవరి 31 వరకు అన్ని గ్రామాల్లోను పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పశు సంవర్థకశాఖ ఉప సంచాలకులు మూర్తి, సహాయ సంచాలకులు కృష్ణ, ఎంపీపీ పంపన నాగమణి, ఉపసర్పంచ్ సలాది వెంకన్న శ్రీనివాస్, కూటమి నాయకులు తొట వెంకన్న, సలాది రమేష్, తాడాల మాచరరావు, సలాది వెర్రిబాబు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.