ఏపీలో పేదల ఇళ్ల పంపిణీకి ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి పార్థసారథి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన పేదల ఇళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభించి, వాటిని 1.14 లక్షల లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పీఎంఏవై 1.0 గడువు 2025 డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందని మంత్రి చెప్పారు. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందు కు రూ. 900 కోట్లు విడుదలకు ప్రయత్నిస్తున్నట్లు కూడా తెలిపారు.