చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. 'సూపర్ సిక్స్ హామీలపై పచ్చి అబద్దాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయమంతా లాక్కోవడమే.
అధికారంలోకి వచ్చాక ప్రజాద్రోహమే చంద్రబాబు నైజం. ప్రజల సంక్షేమం పట్టించుకోరు. ఎన్ని కష్టాలు వచ్చినా హామీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఆచరణ సాధ్యం కాదని నాటకాలు ఆడుతున్నారు' అని దుయ్యబట్టారు.