కూటమి ప్రభుత్వంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. 'సూపర్ సిక్స్- సూపర్ ఫ్లాప్. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడినట్లే. దీనికి నిన్న చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్ నిదర్శనం.
నీతి ఆయోగ్ ముందు పెట్టి డబ్బులుంటేనే పథకాలని చంద్రబాబు నీతి-సూక్తులు చెప్పారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది' అని చంద్రబాబు తీరుపై షర్మిల మండిపడ్డారు.