గుజరాత్‌కు చెందిన ప్రకాష్.. కడిలోని ఓ మెటల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే జనవరి 26వ తేదీ రోజు గణతంత్ర దినోత్సవం కావడంతో.. అతడికి సెలవు ఇచ్చారు. ఈక్రమంలోనే ప్రకాష్ ఆరోజు ఖాళీగా ఉండడం ఇష్టం లేక తన సోదరులు, కజిన్లను కలవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని వారికి చెప్పి వారున్న చోటుకు వెళ్లాడు. ముఖ్యంగా తన సొంత తమ్ముడు మేవాభాయ్‌ను తీసుకుని అతడి కజిన్ అల్పేష్ వద్దకు వెళ్లాడు. అక్కడే మరికొంత మంది బంధువులు కూడా ఉన్నారు.
అయితే ఆరోజు చాలా సేపు హాయిగా కబుర్లాడుకుని.. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఈక్రమంలోనే కల్పేష్.. తనకు బావ వరుస అయ్యే ప్రకాష్‌ను ఆట పట్టించాలనుకున్నాడు. అతడు నిద్ర పోతుండడం గమనించి.. ఓ కంప్రెసర్ పైపు తీసుకు వచ్చి అతడి ప్రైవేటు పార్టులోకి జొప్పించాడు. అతడు వద్దని అంటున్నా వినకుండా బలవంతంగా గాలి కొట్టాడు. ఈ చర్యతో ప్రకాష్ పూర్తిగా ఉబ్బిపోయాడు. దీంతో భయపడిపోయిన అల్పేష్ వెంటనే పైపును తీసేశాడు. ఈక్రమంలోనే ప్రకాష్‌కు వాంతులు కావడం ప్రారంభం అయ్యాయి.
ఆ విషయం గుర్తించిన మేవాభాయ్, వారి బంధువులు అందరూ లేచి ప్రకాష్‌ను వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వెంటనే అతడిని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారంతా ప్రకాష్‌ను సదరు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రకాష్ ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. అయితే సరదాగా తన బావ మరిది అల్పేష్ చేసిన పని వల్లే తన సోదరుడు ప్రకాష్ ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన మేవాభాయ్.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
తన బావ మరిది చేసిన పనిని పోలీసులకు తెలిపాడు. అల్పేష్ వల్ల తన సోదరుడు చనిపోయాడని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆపై ప్రకాష్ మృతదేహాన్ని పరిశీలించగా.. అతడి శరీరం అంతా గాలితో నిండిపోయి ఉబ్బిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడు అల్పేష్‌ను అదుపులోకి కూడా తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa