మహాకుంభమేళలో ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసేందుకు తరలివచ్చారు. దీంతో మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో సెక్టార్ 2 లో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.కాగా ఈ వార్తలపై యూపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహాకుంభంలో జరిగిన అసంఘటిత ప్రమాదంలో భక్తులు మరణించిన వార్త చాలా బాధాకరం. వారందరికీ నా నివాళులు అర్పించారు. అలాగే తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ఉత్తమ ఆస్పత్రులకు తరలించి వెంటనే వైద్య చికిత్స అందించాలి. మృతుల మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించి వారి నివాసానికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.అలాగే తమ బంధువులతో విడిపోయిన వారిని తిరిగి కలపడానికి తక్షణమే కృషి చేయాలి. హెలికాప్టర్లను సద్వినియోగం చేసుకుని కుంభమేళలో నిఘా పెంచాలి. ఈ క్లిష్ట సమయంలో భక్తులు సంయమనం, సహనం పాటించి వారి తీర్థయాత్రను శాంతియుతంగా పూర్తి చేయాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. నేటి ఘటన నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తుల బస, వసతి, భోజనం, నీరు తదితర సౌకర్యాలకు అదనపు ఏర్పాట్లు చేయాలి. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాని ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ లో రాసుకొచ్చారు. అలాగే మరో ట్వీట్ లో ''ప్రపంచ స్థాయి వ్యవస్థ' అనే వాదనలో నిజం బయటపడింది.కాబట్టి ఈ దావాను అసత్య ప్రచారం చేస్తున్నవారు ఈ సంఘటనలో మరణించిన వ్యక్తుల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలి' అని డిమాండ్ చేశారు.