13 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న భారత దిగ్గజ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు కోహ్లీ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. గేట్ నంబర్ 16 బయట ఉన్న జనం ఒకరినొకరు తోసుకోవడంతో కొందరు కింద పడిపోయి గాయపడ్డారు. భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa