మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపధ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభ్‌లో వీవీఐపీ పాసులను రద్దు చేసింది.ప్రయాగ్‌రాజ్ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది. మంగళవారం త్రివేణి సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మహాకుంభ్ ప్రాంతంలోకి వాహనాల ఎంట్రీని నిషేదించింది.వెహికిల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్రత్యేక పాసులకు కూడా అనుమతి లేదు. వీవీఐపీ పాసులను కూడా రద్దు చేసింది. ఏ వాహనానికి మినహాయింపు ఉండదు. వన్‌వే రూట్లను అమలు చేస్తున్నారు.భక్తులు సలువుగా నడిచేందుకు వన్‌వే ట్రాఫిక్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేయనున్నారు. డిస్ట్రిక్ బోర్డర్ల వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు. రద్దీని తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నారు.ఫిబ్రవరి 4వ తేదీ వరకు చాలా కఠిన నిబంధనలు పాటించనున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోకి ఫోర్ వీలర్ వాహనాల ఎంట్రీని నిలిపివేశారు. కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో.. క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు.