ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1న అన్నమయ్య జిల్లా పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో కడప ఎయిర్ పోర్ట్ కు రానున్న నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలపై పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎయిర్ పోర్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.