కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు. రెండో ఛాన్స్ అడిగినా ప్రజలు ఇవ్వరు. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదు. ఇక, జమిలి ఎన్నికలు వస్తే చంద్రబాబుకు నష్టం.
అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరు.’ అని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. దాంతో జమిలి ఎన్నికలతో చంద్రబాబుకు నష్టం వాటిల్లుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జమిలి వచ్చినా కూటమి పార్టీనే విజయం సాధిస్తుందని ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.