ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు గరుడ ఏరోస్పేస్ తెలిపింది. రూ.100 కోట్లతో దేశంలోనే తొలి డ్రోన్ సిటీ ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఈ డ్రోన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో గరుడ ఏరోస్పేస్ సీఈవో ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఈ డ్రోన్ సిటీ ఏర్పాటు కోసం ఆసక్తి చూపినట్లు తెలిసింది.